ఉదయపూర్
-------- అర్బుదాద్రియే యవనికయైయుండ=చిత్రరంగస్థలము వోలె
అలరించుచుండెనీ నగరసౌందర్యమ్ము
తెల్లకలువల వనములాగున=తీర్చియున్నది సరోసౌధము
రాణివాసపు రమణులెందరొ =సేదదీరగ యంత్రజలముల
ఆడిపాడిరి అంతిపురమున
రాజపుత్రుల రణపరాక్రమ=రమ్యగాథల గుర్తులెన్నో
కోరమీసపు కొదమసౌరు =ముసుగులోపలి ముద్దుమొగము
రాజభూమికి రత్నహారము = రంజిల్లెడి యీ ఉదయపురము
------------------------