23, డిసెంబర్ 2011, శుక్రవారం

kendra akademy sanmaanaalu

ఈ మధ్య జాతీయ కేంద్ర సంగీత నాటక అకాడమీ ,కేంద్ర సాంస్కృతిక శాఖ వారు ,విశ్వకవి రవీంద్ర నాథ టాగోర్ ౧౫౦ జయంతి సందర్భంలో ౫౦ మంది సీనియర్ కళాకారులకు uuఅకాడమీ ఫెలోషిప్ సన్మానపత్రం ,౩లక్శల రూపాయల నగదు యిచ్చి సన్మానించారు.వారిలో తెలుగు వారి పేర్లు దిగువ ఇస్తున్నాను.
   ౧. రజనీకాంతరావు.౨.పి.వీ .కృష్ణమూర్తి ౩.m .నాగభూషణ శర్మ. ౪.DR శ్రీపాద పినాకపాణి. ౫.నేదునూరి కృష్ణ మూర్తి. ౬.పసుమర్తి వేణుగోపాల కృష్ణ శర్మ. వీరికి టాగూర్ రత్న అవార్డ్ ఇచ్చారు.తెలుగు మహిళా కాకపోయినా అందరికీ తెలిసిన వైజయంతీ మాల పేరు కూడా ఇందులో ఉందని తెలియ జేస్తున్నాను.
  ఇంకా టాగూరు పురస్కార ఇచ్చిన వాళ్ళలో తెలుగు వాళ్ళు.(సన్మానపత్రం ,ఒక లక్ష రూపాయల నగదు.)
  ౧.పట్రాయని సంగీతరావు. (నృత్యానికి సంగీతం )౨.భాగవతుల సీతారామ శర్మ (haaనృత్య సంగీతం)౩.భాగవతుల యజ్న నారాయణ శర్మ .(కూచిపూడి నృత్యం )౪.చాట్ల శ్రీరాములు (natana )
     సదా శివ గారికి కేంద్ర సాహిత్య అవార్డు ఇంతకూ ముందే ఇవ్వడం తెలిసిందే .పై ప్రముఖులకు అందరికీ అభినందనలు తెలియ జేద్దాము.